ఈ గ్యాప్ లో “వకీల్ సాబ్” అప్డేట్ ఉందా?

ఈ గ్యాప్ లో “వకీల్ సాబ్” అప్డేట్ ఉందా?

Published on Nov 10, 2020 4:50 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. ఇప్పటికే చాలా మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగిలి ఉన్న టాకీ పార్ట్ ను కూడా పవన్ పూర్తి చేసేయాలని మళ్ళీ పాత మేకోవర్ కు పవన్ రావడంతో త్వరలోనే ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నా పవన్ ఫ్యాన్స్ మాత్రం వకీల్ సాబ్ టీజర్ కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారమూ లేకపోయే సరికి అసలు టీజర్ ఉందా లేదా అన్న డైలమాలో పడ్డారు. కానీ ఈ రెండు రోజుల గ్యాప్ లో మాత్రం వకీల్ సాబ్ యూనిట్ నుంచి టీజర్ పై అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గట్టి గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ టీజర్ విషయంలో భారీ అంచనాలు పెట్టుకొన్నారు. మరి ఇక అంతా మేకర్స్ చేతిలోనే ఉంది. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రలు చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు