క్రిష్ కొత్త ప్లానింగ్.. పవన్ ఒప్పుకుంటారా ?

క్రిష్ కొత్త ప్లానింగ్.. పవన్ ఒప్పుకుంటారా ?

Published on Nov 10, 2020 3:00 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సినిమా షూటింగ్లు రీస్టార్ట్ చేశారు. కోవిడ్ లాక్ డౌన్ ముందు ఆయన మొదలుపెట్టిన చిత్రాల్లో ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా కూడా ఉంది. క్రిష్ సినిమా కొద్ధి షూటింగ్ జరగ్గా ‘వకీల్ సాబ్’ దాదాపు 70 నుండి 80 శాతం వరకు చిత్రీకరణ జరుపుకుంది. అందుకే పవన్ ముందుగా ‘వకీల్ సాబ్’ను కంప్లీట్ చేసే పనిపెట్టుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పూర్తి చిత్రీకరణ ముగియనుంది.

దీని తర్వాత క్రిష్ పిరియాడికల్ మూవీని రీస్టార్ట్ చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ ఈలోపు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ వచ్చి చేరింది పవన్ జాబితాలో. ఈ సినిమాకు ఏకధాటిగా కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉండటంతో క్రిష్ సినిమాను పక్కనబెట్టి ఆ రీమేక్ సినిమాను పూర్తిచేయాలని పవన్ భావించారట. దీంతో ఇంకో మూడు నెలల పాటు క్రిష్ సినిమాకు బ్రేకులు పడ్డట్టే అనుకున్నారు. కానీ క్రిష్ మాత్రం మధ్యలో ఎక్కడైనా గ్యాప్ దొరికితే చిన్నపాటి షెడ్యూల్ ప్లాన్ చేయాలని భావిస్తున్నారట.

విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా అవసరమయ్యే సన్నివేశాలు కొన్నింటిని ఆ గ్యాప్లో
షూట్ చేసుకుంటే పవన్ రీమేక్ సినిమాను కంప్లీట్ చేసేలోపు ఆ సీజీ పనులు చూసుకోవచ్చనేది క్రిష్ ప్లానట. మరి ఆమోదయోగ్యాంగా ఉన్న క్రిష్ ఆలోచనకు పవన్ అంగీకరించి రీమేక్ మధ్యలో వీలుచేసుకుని డేట్స్ కేటాయిస్తారేమో చూడాలి.

తాజా వార్తలు