ఇటీవలే కరోనా నుండి కోలుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా పాత వేగాన్ని అందుకుంది. కెరీర్లో ఎప్పుడూ ఖాళీగా ఉండని ఆమె కోవిడ్ కారణంగా షూటింగ్‌లకు దూరమైంది. ఇప్పుడుపూర్తిగా కోలుకోవడంతో కొత్త ప్రాజెక్ట్స్ కూడ సైన్ చేస్తోంది. తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ప్రేక్షకులకు అందివ్వనుంది. దీనిని ప్రదీప్.యు నిర్మిస్తున్నారు.
కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా లాంచ్ అయింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు దీనిని తెరకెక్కించనున్నారు. ప్రవీణ్ సత్తారు గతంలో ‘పిఎస్వి గరుడవేగ, గుంటూరు టాకీస్’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసి ఉండటంతో ఈ వెబ్ సిరీస్ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతోంది. దీనికి ’11త్ హావర్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో తమన్నా భిన్నమైన పాత్రలో, కొత్త ఆహార్యంలో కనిపిస్తుందట. ఇకపోతే తమన్నా ప్రస్తుతం నితిన్ చేయనున్న ‘అందాదూన్’ తెలుగు రీమేక్‌లో నెగెటివ్ రోల్, ‘గుర్తుందా శీతాకాలం’లో కథానాయిక పాత్రను చేస్తోంది.