‘పుష్ప రాజ్’ టైమ్ ఆసన్నమైంది

‘పుష్ప రాజ్’ టైమ్ ఆసన్నమైంది

Published on Nov 9, 2020 12:03 PM IST

‘అల వైకుంఠపురములో’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చేస్తోన్న చిత్రం ‘పుష్ప’. సెన్సేషనల్‌ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. టెస్ట్ షూట్ ముగించి ఫైనల్ షూట్ కు వెళ్లే లోపు లాక్ డౌన్ మూలంగా అది కాస్త ఆగిపోయింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా కూడ నటీనటుల డేట్స్ వగైరాలు కుదరక ఇన్నాళ్లు వాయిదాపడుతూ వచ్చిన చిత్రీకరణ ఎట్టకేలకు మొదలుకానుంది. రేపటి నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.

ఇప్పటికే అల్లు అర్జున్ రాజమండ్రి చేరుకున్నారు. మారేడుమిల్లి అడవుల్లో సన్నివేశాల చిత్రీకరణ ఉండనుంది. సుమారు ఏడెనిమిది నెలల తర్వాత బన్నీ సెట్స్ మీదకు వెళుతుండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పుష్ప’ షూటింగ్ గురించిన వార్తే ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రెడ్ సాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగబోయే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ పాత్రలోనే కనిపించనున్నారు.

తాజా వార్తలు