పుష్ప షూటింగ్ కోసం సిద్దమైన బన్నీ…!

పుష్ప షూటింగ్ కోసం సిద్దమైన బన్నీ…!

Published on Nov 8, 2020 10:34 PM IST


టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలవుతుంది. ఇప్పటికే నాగార్జున, నితిన్, నాగ చైత్యన్య వంటి హీరోలు తమకు కొత్త చిత్రాల షూటింగ్స్ మొదలుపెట్టారు. ఇక రేపటి నుండి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ సెట్స్ లో పాల్గొననున్నాడు. అలాగే వెంకటేష్ వెంకీ మామ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు తెలియజేశారు. కాగా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా ఉన్న పుష్ప షూటింగ్ కి టీం సిద్ధం అవుతుందనని తెలుస్తుంది. పుష్ప షూటింగ్ కోసం అల్లు అర్జున్ రాజమండ్రి వెళ్లారట.

దర్శకుడు సుకుమార్ పుష్ప నెక్స్ట్ షెడ్యూల్ గోదావరి ప్రాంతంలో ప్లాన్ చేసినట్లు సమాచారం. నిజానికి సుకుమార్ పుష్ప నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేశారు. లాక్ డౌన్ తరువాత ఆయన తన ఆలోచన మార్చుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని దట్టమైన అడవులలో పుష్ప షూటింగ్ జరగనుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు