బిగ్ బాస్ – సుమ ఎంట్రీ వెనుక సీక్రెట్ ఇదేనా?

బిగ్ బాస్ – సుమ ఎంట్రీ వెనుక సీక్రెట్ ఇదేనా?

Published on Nov 8, 2020 3:37 PM IST

ఈరోజు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ 4 లో తెలుగు స్మాల్ స్క్రీన్ నెంబర్ 1 యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ఊహించని ట్విస్ట్ ను మేకర్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అంతా ఆ చర్చే బిగ్ బాస్ వీక్షకుల నడుమ జరుగుతుంది. అయితే సుమ ఎంట్రీ అనేది అస్సలు ఎవరూ ఊహించనటువంటిది.

దీంతో ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ లో అంతకు మించిన ఎంటెర్టైనేమేంట్ రావడం ఖాయం అని చెప్పొచ్చు. మరి మేకర్స్ నుంచి ఈ సడెన్ చేంజ్ ఎందుకు వచ్చింది అన్న టాక్ కూడా మొదలయ్యింది. అయితే ఈ సీక్రెట్ వెనుక ఉన్న అసలు విషయం ఏమిటా అన్నది తెలుస్తుంది. గత సీజన్ కు హోస్ట్ చేసిన నాగ్ తోనే మళ్ళీ హోస్టింగ్ అంటే మంచ్చి రెస్పాన్స్ వచ్చింది.

అందుకు తగ్గట్టుగానే సీజన్ 4 మొట్ట మొదటి ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.కానీ తర్వాత మెల్లగా షో లో మజా లేకపోయే సరికి ఆడియెన్స్ పక్కన పెట్టారు. దీనితో మేకర్స్ వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఊపు తెచ్చి బాగా మనగె చెయ్యడంతో ఆ ట్రిక్ వర్కౌట్ అయ్యింది. అది కొన్ని రోజుల పాటు సాగగా అంతా మామూలే అయ్యిపోవడంతో రేటింగ్ కూడా తగ్గింది.

దీనితో మేకర్స్ మరో సమస్య మొదలయ్యింది. ఇప్పుడు దానిని సుమ ఎంట్రీ తో రీప్లేస్ చేయనున్నారా అన్న టాక్ వినిపిస్తుంది. సుమ లాంటి పెద్ద హెడ్ బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అనేది మరింత ఆసక్తికర అంశమే మరి. ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు