లాక్ డౌన్ లోనే పెళ్లి భాజా మోగించిన రానా ప్రేయసి మిహికా బజాజ్ మెడలో తాళి కట్టారు. అత్యంత సన్నిహితుల మధ్య లో ప్రొఫైల్ లో ఈ మ్యారేజ్ జరిగింది. ఇటీవలే హనీమూన్ కి వెళ్లొచ్చిన రానా, త్వరలో విరాట పర్వం షూటింగ్ లో పాల్గొననున్నారు. కాగా ఆయన నటించిన అరణ్య విడుదల సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన అరణ్య మూవీలో రానా డీగ్లామర్ రోల్ చేయడం విశేషం.
తాజాగా రానా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశారు. బాబాయ్ వెంకటేష్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు, ఇటీవల ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు ఆయన చెప్పడం జరిగింది. వెంకీ అభిమానులు ఎప్పటి నుండో ఈ క్రేజీ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ మూవీపై హింట్ ఇచ్చి ఫ్యాన్ ని ఖుషీ చేశారు. మరో వైపు పవన్ సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ లో ప్రకటించిన మల్టీ స్టారర్ లో కూడా రానా నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.