‘ఆర్ఆర్ఆర్’ నుండి మేకింగ్ వీడియో !

‘ఆర్ఆర్ఆర్’ నుండి మేకింగ్ వీడియో !

Published on Nov 7, 2020 10:36 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి రీసెంట్ గా వచ్చిన తారక్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ యొక్క ప్రొడక్షన్ హౌస్ డివివి మూవీస్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆర్‌ఆర్‌ఆర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరక్కిస్తోన్న మేకింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ చిన్న వీడియోలో వందలాది సహాయక నటులతో యాక్షన్ సీక్వెన్స్ భారీ స్థాయిలో చిత్రీకరించబడుతోందని అర్ధం అవుతుంది.

ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై కీరవాణి వర్క్ చేస్తున్నాడట. ఇప్పటివరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న సీన్స్ కు సంబందించి ఇప్పటికే మెయిన్ బిజియమ్ ను పూర్తి చేశాడని, కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ ‘బిజియమ్ బీట్’ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. పైగా కీరవాణి కెరీర్ లోనే ఈ బిజియమ్ బిట్ బెస్ట్ అవుతుందట. ఇక రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కుతుంది.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

తాజా వార్తలు