తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో ఇప్పుడు నాలుగో సీజన్లోకి అడుగు పెట్టి దూసుకెళ్తుంది. అయితే మొదట్లో కాస్త చప్పని స్టార్టింగ్ వచ్చినా తర్వాత ఏదో చేసి ఆడియెన్స్ లో మంచి ఇంపాక్ట్ తెచ్చారు. అలాగే షో సగం కూడా పూర్తి కావస్తుండడంతో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ పై ఆడియెన్స్ లో ఒక అంచనా వచ్చింది.
అయితే అంత మందిలో కూడా ఇప్పుడు ఒక కంటెస్టెంట్ మీద మాత్రం మామూలు స్థాయి నెగిటివి నమోదు అవ్వడం లేదు. అతడే అమ్మా రాజశేఖర్. షో మొదటి నుంచి పేక్షకుల్లో ఈ కంటెస్టెంట్ పట్ల సాఫ్ట్ కార్నర్ అని చెప్పలేం కానీ అలా అని నెగిటివ్ కూడా లేకుండా ఉన్నారు.
కానీ అలా రోజులు గడవడం లేటెస్ట్ గా క్యాప్టెన్ అయ్యాక అతని అసలు వెర్షన్ ఏమిటి అన్నది బయట పడడంతో ఓ రేంజ్ లో నెగిటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీనితో అతని ప్రవర్తనపై వేసరిపోయిన ఆడియెన్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి త్వరలోనే ఎలిమినేట్ అయ్యిపోతాడని అంటున్నారు.