ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్ర యూనిట్ నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ కూడా భారీ స్థాయిలో అంచనాలను పెంచుతూ వస్తున్నాయి.
ఇక ఇదిలా ఉండగా లాక్ డౌన్ లో చాలా కాలం సస్పెన్స్ అనంతరం జక్కన అండ్ టీం షూటింగ్ ను మొదలు పెట్టి శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అలా నిన్న మనం చెప్పుకున్నట్టుగా రాజమౌళి కొన్ని కీలక షాట్స్ ను ఈరోజు తెల్లవారు జాము వరకు తెరకెక్కించారు.
అవి తారక్ మరియు చరణ్ ల ఉండే కీలక షాట్స్ అనే వినిపించింది. భారీ సెట్స్ మరియు బ్లూ మాట్స్ లో రాజమౌళి ఈ సన్నివేశాలను తెరకెక్కించారు. మొత్తానికి మాత్రం ఈ కీలక సన్నివేశాలను జక్కన కంప్లీట్ చేసాడు. ఇక తర్వాత ఏ సన్నివేశాలను తెరకెక్కిస్తారో అన్నది తెలియాల్సి ఉంది.