ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఆచార్య”. ఇప్పటి వరకు కొంత మేర షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా చాలానే బ్యాలన్స్ ఉంచుకుంది. అయితే అది స్టార్ట్ అవుతుంది అనుకున్న సమయంలోనే ఆగుతూ వస్తుంది. కానీ మొత్తానికి మేకర్స్ వచ్చే జనవరి నుంచి షూట్ కు ముహూర్తం కుదిర్చారు.
అయితే ఇదే గ్యాప్ లో ఊహించని “ఆచార్య” స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేర్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇప్పుడొక కీలక చేంజ్ ను చిరు స్ట్రాంగ్ గా కోరుకున్నారట. అదే కామెడీ విషయంలో..చిరు తన సినిమాల్లో ఎంటెర్టైన్మెంట్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. అలా ఈ చిత్రంలో కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా మరిన్ని హంగులు ఉండేలా మార్పులు చేస్తున్నారట.
ఇప్పటికే చిరు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో పలు సినిమాల్లో మనం చూసాము కానీ అది ఈ మధ్య కాలంలో చాలా దూరం అయ్యింది. దానిని ఈ చిత్రంలో భర్తీ చెయ్యాలని చూస్తున్నారట. మరి ఈ సినిమాలో చిరు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.