ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ నటించనున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”లోకి జాతీయ అవార్డు గ్రహీత కీర్తీ సురేష్ కూడా నటించనుంది అని మేకర్స్ కన్ఫామ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో పాటుగా ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
అలాగే మహేష్ మరియు కీర్తీల కాంబో కోసం మహేష్ అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కీర్తీకు దర్శకుడు పరశురామ్ ఒక సాలిడ్ రోల్ ను డిజైన్ చేశారట. అందుకే కీర్తీ ఈ రోల్ ఎప్పుడు చెయ్యాలా అని ఎదురు చూస్తుందట. అంతే కాకుండా తన రోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనుంది అని ఆమె తెలిపారు.
అందుకు చాలా ఎగ్జైట్ గా ఈ సినిమా విషయంలో ఉన్నానని తెలిపారు. మరి ఈ చిత్రంలో కీర్తీ ఎలాంటి రోల్ లో కనిపించనుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.