యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ చిత్రంలో అల్లూరిగా రామ్ చరణ్ కొమరం భీం గా తారక్ లు నటిస్తుండగా ఈ ఇద్దరిపై డిజైన్ చెయ్యబడిన రెండు టీజర్లు కూడా దేశ వ్యాప్తంగా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే అసలు ఈ కాంబో అండ్ సినిమా పైనే వేరే లెవెల్ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలను ఓకే స్క్రీన్ పై అంటే అది మామూలు విషయం కూడా అందుకే అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి కొన్ని హైలైట్ షాట్స్ ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారట. సినిమాలోని ఇంటర్వెల్ కు సంబంధించి ఇద్దరు హీరోలపైన కలిపి ఉండే పవర్ ఫుల్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం జక్కన శరవేగంగా సినిమాను కంప్లీట్ చేసేసే పనిలో ఉన్నారని చెప్పాలి.