నూతన నటీనటులు హర్స్ మరియు సిమ్రాన్ చౌదరిలు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం “సెహరి”. అయితే ఈరోజు ఈ చిత్రం తాలూకా టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. విర్గో పిక్చర్స్ వారు ఈరోజు నార్మల్ పూజతో హైదరాబాద్ లో షూట్ ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమానికి గాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అలాగే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అయితే ఈ ముహూర్తం షాట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా దిల్ రాజు క్లాప్ కొట్టారు. అలాగే ఏషియన్ సినిమాస్ భరత్ నరంగ్ మేకర్స్ కు స్క్రిప్ట్ ను అందించారు. అయితే ఈ చిత్రాన్ని రోమ్ కామ్ ఎంటర్టైనర్ గా గంగా సాగర్ ద్వారక దర్శకత్వం వహించనున్నారు. ఈ దర్శకుడు ఇంతకు మునుపు పలు యాడ్స్ కు దర్శకత్వం వహించారు.
అలాగే ఈ చిత్రానికి గాను ప్రశాంత్ ఆర్ సంగీతం అందిస్తుండగా సీనియర్ సంగీత దర్శకుడు కోటి కీలక పాత్ర వహించనున్నారట. అలాగే ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి మరియు శిల్ప చౌదరిలు అందిస్తున్న నిర్మాణ విలువలు కూడా అత్యున్నతంగా ఉంటాయట. ఈరోజు పూజా కార్యక్రమం మొదలు కావడంతోనే ఈ చిత్రం రెగ్యులర్ షూట్ కూడా మొదలు కానుందట.