“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Nov 3, 2020 11:00 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” వరుస విజయాల చిత్రాలతో దూసుకెళ్తున్న మహేష్ ఈ చిత్రంతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని స్టార్ట్ చేసారు.

అయితే ఇన్నాళ్ల పాటు లాక్ డౌన్ మూలాన షూటింగ్ వాయిదా పడ్డ షూట్ ఈ నవంబర్ లో మొదలు కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత ఆగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మొదలు కానున్న షూట్ కు సంబంధించి తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ కు యూఎస్ వెళ్లే క్రమంలోనే మహేష్ తన ఫ్యామిలీతో వెకేషన్ ను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అందుకే మహేష్ కాస్త ముందే యూఎస్ కు చేరుకోనున్నారట. డిసెంబర్ చివరి వారంలో మహేష్ అక్కడికి వెళ్లగా చిత్ర యూనిట్ అప్పటికే రెడీ చేసిన పనులతో సర్కారు వారి పాట షూట్ జనవరి మొదటి వారం లో మొదలు పెట్టనున్నారట. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి మహేష్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు