నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. లాక్ డౌన్ ముగియండంతో సినిమా సూటి ఇటీవలే మొదలైంది. అయితే ఈ సినిమాకు అన్నీ సెట్టయ్యాయి కానీ కీలకమైన ప్రతినాయకుడి విషయంలో క్లారిటీ వచ్చినట్టు కనిపించట్లేదు.
గతంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ చేత విలన్ రోల్ చేయించాలి అనుకున్నా ఆయనకు ఆరోగ్యం దెబ్బతిని ట్రీట్మెంట్ కోసం వెళ్లడంతో ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు టాక్ నడిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రతిఓనాయకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. చిత్ర యూనిట్ సైతం ఆ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంటే ఇంకా విలన్ సెట్ కాలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి అభిమానుల్లో. ఇకపోతే ఇందులో మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ కథానాయకిగా నటించనుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.