‘మోసగాళ్లు’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట !

‘మోసగాళ్లు’లో ఆ సీక్వెన్స్ అదిరిపోతుందట !

Published on Nov 1, 2020 8:10 PM IST

మంచు విష్ణు మంచి బిజినెస్ మెన్ కూడా. ముఖ్యంగా కథలను కూడా బాగా జడ్జ్ చేస్తారు. కాగా ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా కథ గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో రోబరికి సంబంధించి ఓ సీక్వెన్స్ అదిరిపోతుందట. పైగా యూనివర్సల్ స్టోరీతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఇక హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ బాగా ఆకట్టుకుంటుందని, ఇక తెలుగు వర్షన్ లో కొన్ని మార్పులు చేశామని.. ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తోందని ఆ మధ్య విష్ణు స్వయంగా చెప్పుకొచ్చారు.

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. అయితే కరోనా దెబ్బకు సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి. సో.. మరి ముందు అనుకున్న మిగిలిన సినిమాలు అన్ని సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. మరి వాటితో పాటే ‘మోసగాళ్లు’ కూడా రిలీజ్ అవుతుందా ? లేక పోస్ట్ ఫోన్ అవుతుందా అనేది చూడాలి. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు