మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరోస్ లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. కెరీర్ ఆరంభంలో మంచి గ్రాఫ్ తో సాయితేజ్ మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ తర్వాత అలా గ్రాఫ్ ను కోల్పోయిన సాయి తేజ్ “చిత్ర లహరి”, “ప్రతిరోజూ పండగే” సినిమాలతో మంచి కం బ్యాక్ అందుకున్నాడు.
ఇక అక్కడ నుంచి మంచి టాలెంటెడ్ దర్శకులతో సినిమాలను లైన్ లో పెడుతున్న సాయి తేజ్ దేవ కట్ట తో ఒక ప్రాజెక్ట్ ను ఇటీవలే అనౌన్స్ చేసారు. ఆ చిత్రానికి గాను ఒక టాలెంటెడ్ హీరోయిన్ ను ఎంపిక చెయ్యగా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట.
ఇక అసలు వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రానికి ముందు నివేతా పెత్తురాజ్ ను అనుకున్నారట. కానీ అనుకోని విధంగా ఆమెకు కాల్షీట్స్ విషయంలో బ్యాలన్స్ తప్పడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట.