ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం లైన్ లో ఉండగానే పవన్ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసారు. అలాంటి వాటిలో తన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఒకటి. “గబ్బర్ సింగ్” లాంటి సాలిడ్ హిట్ తర్వాత వీరి కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చెయ్యగానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అదే ఊపులో పవన్ బర్త్ డే సందర్భంగా ఒక ఆసక్తికర పోస్టర్ ను విడుదల చేసి మరిన్ని అంచనాలు పెంచారు. అయితే ఇప్పుడు ఈ సాలిడ్ కాంబోపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇటీవలే హరీష్ శంకర్ పవన్ కు లైన్ వినిపించారని అలాగే పవన్ కు కూడా స్క్రిప్ట్ నచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే కథ ఒక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా పొలిటికల్ గా హరీష్ మార్క్ సెటైర్స్ ఉంటాయని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుందో చూడాలి.