ఈ ప్రైడ్ ఇండియన్ డైరెక్టర్ తో యష్..నిజమేనా?

ఈ ప్రైడ్ ఇండియన్ డైరెక్టర్ తో యష్..నిజమేనా?

Published on Nov 1, 2020 10:53 AM IST

కేజీయఫ్ అనే సినిమాతో ఒక్కసారిగా భారతదేశమంతటా పాపులర్ అయ్యాడు కన్నడ స్టార్ హీరో యష్. ఇప్పుడు రానున్న చాప్టర్ 2 తో మరిన్ని స్థాయి అంచనాలను ఏర్పర్చుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇక ఈ చిత్రం అనంతరం యష్ ఏ దర్శకునితో సినిమా చేస్తారు అన్నది మాత్రం కన్ఫామ్ కాలేదు.

అయితే ఇప్పుడు కోలీవుడ్ సినీ వర్గాల్లో ఒక లేటెస్ట్ గాసిప్ ఊపందుకుంది. మన దేశపు టాప్ ప్రైడ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో యష్ సినిమా ఉంటుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ఈ కాంబో కనుక సెట్టయ్యి స్ట్రాంగ్ కంటెంట్ పడితే మాత్రం మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

తాజా వార్తలు