అక్షయ్ ‘లక్ష్మీ బాంబ్’ థియేటర్స్ లో పేలేది అప్పుడే..!

అక్షయ్ ‘లక్ష్మీ బాంబ్’ థియేటర్స్ లో పేలేది అప్పుడే..!

Published on Jul 17, 2020 4:41 PM IST

బాలీవుడ్ మూవీ మెషిన్ అక్షయ్ కుమార్ తెలుగు తమిళ భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కాంచన చిత్ర హిందీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాంచన చిత్రాన్ని తెరకెక్కించి మరియు నటించిన రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. లక్ష్మీ బాంబ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది.

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఐతే థియేటర్స్ బంద్ కారణంగా వాయిదాపడుతుంది. కాగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన పక్షంలో లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని అక్షయ్ పుట్టిన రోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 9న విడుదల చేయాలని అనుకుంటున్నారట. కానీ పక్షంలో ఈ మూవీ ఓ టి టి లో విడుదల చేయాలనేది నిర్మాతల ప్లాన్ అని తెలుస్తుంది.

తాజా వార్తలు