సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. ఆయన దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుపెట్టాలన్నది చిత్ర యూనిట్ ప్రణాళిక. ఇక ఈ మూవీ కథపై ఇప్పటికే కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఈ మూవీ ఆర్ధిక నేరాలపై తెరకెక్కే క్రైమ్ అండ్ రివేంజ్ డ్రామా అయ్యే సూచనలు కలవని అంటున్నారు. కాగా ఈ చిత్రంపై మరో ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది.
మహేష్ ఈ చిత్రంతో మొదటిసారి డ్యూయల్ రోల్ ట్రై చేస్తున్నారట. మహేష్ రెండు భిన్నమైన స్వభాలు కలిగిన ట్విన్స్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. బాలనటుడిగా డ్యూయల్ రోల్ చేసిన మహేష్, హీరోగా మారిన తరువాత చేయలేదు. మరి మహేష్ సర్కారు వారి పాట మూవీతో ఆ ఫీట్ చేసే అవకాశం కలదని అంటున్నారు. మరి ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుండో మహేష్ డ్యూయెల్ రోల్ చేస్తే చూడాలని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.