బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ పతాక స్థాయికి చేరింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆయన నటించిన చిత్రాల వసూళ్ల రికార్డ్స్ ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉన్నాయి. సౌత్ ఇండియా నుండి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో సూపర్ స్టార్ రజినీతో ఆయన పోటీపడుతున్నారు. కాగా సోషల్ మీడియా ఫాలోయింగ్ లో కూడా తనకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు.
కాగా ప్రభాస్ పేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య 16 మిలియన్స్ కి చేరింది. ఈ ఫీట్ అందుకున్న ఏకైన సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్ కావడం విశేషం. ఇక ఈ 16 మిలియన్ ఫాలోవర్స్ ఫీట్ సైతం ప్రభాస్ అతి తక్కువ సమయంలో సాధించారు. కాగా ఇటీవల 15 మిలియన్స్ ఫాల్లోవర్స్ గా ఉన్న ఆయన అకౌంట్ కేవలం ఆరు రోజులలో 1 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించి 16 మిలియన్స్ కి చేరింది. ఏమైనా పాన్ ఇండియా స్టార్ అంటే ఆ మాత్రం ఉంటుంది.