రియల్ హీరో అనిపించుకున్న విజయ్.

రియల్ హీరో అనిపించుకున్న విజయ్.

Published on Jul 16, 2020 3:00 AM IST

స్టార్ హీరో విజయ్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన తదుపరి చిత్ర పారితోషికంలో భారీగా కోత విధించుకున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ పరిస్థితులు చిత్ర పరిశ్రమను కుదేలు చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాతల వందల కోట్ల పెట్టుబడి స్థంభించిపోయింది. భవిష్యత్ లో నిర్మాతలకు భారీ నష్టాలు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. దీనితో విజయ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో చేయనున్న మూవీ పారితోషికంలో 20శాతం తగ్గించుకున్నారట.

ఇక విజయ్ నటించిన మాస్టర్ మూవీ విడుదలకు సిద్దమైంది. థియేటర్స్ తెరుచుకున్న వెంటనే మాస్టర్ మూవీ విడుదల కానుంది. దర్శకుడు లోకేష్ కనక రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ సమకూర్చారు.

తాజా వార్తలు