‘ఆర్ఆర్ఆర్’లో మ్యూజిక్ రెడీ అవుతుంది !

‘ఆర్ఆర్ఆర్’లో మ్యూజిక్ రెడీ అవుతుంది !

Published on Jun 27, 2020 9:00 AM IST

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ట్రయల్ షూట్ చేస్తారని, లేదు మళ్లీ షూట్ చేయాలనే ఆలోచనను విరమించుకున్నారని ప్రస్తుతం రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ లో కూడా రాజమౌళి కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడట. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై కీరవాణి వర్క్ చేస్తున్నాడు.

కాగా ఇప్పటికే ఈ చిత్రం మెయిన్ బిజియమ్ ను పూర్తి చేశాడట, కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బిజియమ్ బిట్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు