చిరు ట్రై చేయని సబ్జెక్టు..యంగ్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్

చిరు ట్రై చేయని సబ్జెక్టు..యంగ్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్

Published on May 15, 2020 12:30 PM IST


ఏమైంది ఈవేళ అనే ఓ రొమాంటిక్ కామెడీ సబ్జెక్టు తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంపంత్ నంది రెండో సినిమానే చరణ్ హీరోగా రచ్చ చేశాడు. ఆ సినిమా కూడా మంచి విజయం అందుకోవడంతో పవన్ తో ఓ సినిమా అవకాశం వచ్చి చేజారింది. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా సీటీమార్ సినిమా చేస్తున్న సంపంత్ నంది తాజా ఇంటర్వ్యూలో తన డ్రీం ప్రాజెక్ట్ గురించి చెప్పారు. సమాజంలో కీలక పాత్ర పోషించే రజాకార్ల నేపథ్యంలో చిరు కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఆ స్క్రిప్ట్ పూర్తి అయిన వెంటనే చిరంజీవిని కలిసి వినిపిస్తాడట.

ఆ నూతన సబ్జెక్టు చిరంజీవికి నచ్చితే సంపంత్ నందికి మంచి అవకాశం దక్కినట్లే. అలాగే చిరంజీవి ఈ మధ్య కాలంలో ట్రై చేయని ఓ డిఫరెంట్ రోల్ లో మనం చూడవచ్చు. ప్రస్తుతం సంపంత్ నంది తెరకెక్కిస్తున్న సిటీమార్ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా హీరో గోపిచంద్, హీరోయిన్ తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది.

తాజా వార్తలు