లాస్ట్ వీక్ తెలుగు టాప్ 5 ప్రోగ్రామ్స్ ఇవే.!

లాస్ట్ వీక్ తెలుగు టాప్ 5 ప్రోగ్రామ్స్ ఇవే.!

Published on May 14, 2020 10:27 PM IST

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించే మాధ్యమాల్లో టెలివిజన్ కూడా ఒకటి.జనం ఎక్కువగా ఇళ్లకే పరిమితం అయ్యారు కాబట్టి అయితే సెల్ ఫోన్ లేదా టీవీ చూస్తూ కాలయాపన చేస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో మన తెలుగు నుంచి గత వారం(18వ వారపు) ఎక్కువగా ఏయే ప్రోగ్రామ్స్ వీక్షించారో వాటిలో టాప్ 5 ప్రోగ్రామ్స్ లిస్ట్ ను బ్రాక్(బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా) వారు వెల్లడించారు.

వీటిలో ఈటీవీ న్యూస్ 8 లక్షల 5 వేలకు పైగా ఇంప్రెషన్స్ తో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో స్టార్ మా ఛానెల్లో హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం “90 ఎంఎల్” 7 లక్షల 80 వేల ఇంప్రెషన్స్ తో నిలిచింది. అలాగే మూడవ స్థానంలో అదే స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే కార్తీక దీపం 5 లక్షల 87 వేల ఇంప్రెషన్స్ అలాగే నాలుగో స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “సరైనోడు” చిత్రానికి 5 లక్షల 71 వేల ఇంప్రెషన్స్ ఇక ఫైనల్ గా ఈటీవీలో ప్రసారం కాబడిన జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ ఎపిసోడ్ కు గాను 5 లక్షల 51 వేల ఇంప్రెషన్స్ రావడంతో టాప్ 5 లో నిలిచింది

తాజా వార్తలు