మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిఖిల్ సిద్దార్థ మారాడు. అయితే తాను తన లైఫ్ లో నేటితో ఒక సరికొత్త లైఫ్ ను తన పెళ్లితో ప్రారంభించారు. దీనితో నిఖిల్ మరియు పల్లవిల జంటకు టాలీవుడ్ సెలెబ్రెటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చాలా సింపుల్ గానే పెళ్లి చేసుకున్న నిఖిల్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.
కానీ వాటిలో ఓ ఫోటో మాత్రం నెటిజన్స్ ను ఒక్కసారిగా ఆకర్షించింది. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు తమ వెడ్డింగ్ బోర్డులో పెట్టిన చిన్న క్రేజీ కోట్ వైరల్ అయ్యింది. ఇంతకీ అందులో ఏముందంటే “మాస్క్ లు ఇక్కడున్నాయ్, శానిటైజర్లు అక్కడున్నాయ్, ప్రేమ అన్ని చోట్లా ఉంది” అంటూ వారి పెళ్లి ప్రాంగణానికి వచ్చిన వారికి చిన్న చిరునవ్వు వచ్చేలా చేసారు. దీనితో ఈ ఫోటో నెటిజన్స్ నిఖిల్ క్రేజీ థాట్ బాగుంది అని అంటున్నారు.