అన్ బీటబుల్ రికార్డ్ సెట్ చేసిన బన్నీ సినిమా.!

అన్ బీటబుల్ రికార్డ్ సెట్ చేసిన బన్నీ సినిమా.!

Published on May 14, 2020 5:58 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా సుశాంత్,నివేతా పెతురాజ్,టబు మరియు జైరాం, మురళి శర్మ లాంటి అగ్ర తారాగణంతో మాటల మాంత్రికుడు తెరకెక్కించిన ఆల్ టైం ముసిచల్ బ్లాక్ బస్టర్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ ను నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి గల మూల కారణం ఈ సినిమా పాటలు అని చెప్పాలి. ఇదే విషయాన్ని దర్శకుడు త్రివిక్రమ్ పదుల సంఖ్యలో ప్రస్తావించారు.

ఈ చిత్రానికి సంగీతం అందించిన థమన్ కు అలాగే సాహిత్యం అందించిన రచయితలకు తన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నారు. “సిరివెన్నెల”సీతా రామశాస్త్రి గారితో రాయించుకున్న ”సామజవరగమన” పాట నుంచి రామ జోగయ్య శాస్త్రి గారి నుంచి రాబట్టుకున్న “బుట్ట బొమ్మ” పాట వరకు ప్రతీది పెను సంచనలనమే దీనితో ఈ పాటలకు యూట్యూబ్ లో కొద్ది సమయంలోనే వందలాది మిలియన్ ల కొద్దీ వ్యూస్ వచ్చి పడ్డాయి.

దీనితో ఈ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇప్పుడు ఏ తెలుగు సినిమా కూడా అందుకోని ఘనత యూట్యూబ్ లో అందుకుంది.ఈ చిత్రం నుంచి వచ్చిన వెర్షన్ పాటలకు గాను ఈ రోజుతో యూట్యూబ్ లో 1 బిలియన్ వ్యూస్ మార్క్ టచ్ అయ్యింది. ఈ అరుదైన ఫీట్ ను అందుకున్న మొట్ట మొదటి చిత్రంగా ఇది నిలిచింది. దీనితో బన్నీ ఖాతాలో మరో అరుదైన అన్ బీటబుల్ రికార్డు పడిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు