సింపుల్ గా నిఖిల్-పల్లవి ల వివాహం పూర్తి..!

సింపుల్ గా నిఖిల్-పల్లవి ల వివాహం పూర్తి..!

Published on May 14, 2020 11:41 AM IST

హీరో నిఖిల్ ఎట్టకేలకు తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మ మెడలో తాళి కట్టారు. నేడు ఉదయం 6:31 నిమిషాలకు శంషాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరి పెళ్లి జరిగింది. కేవలం దంపతుల తల్లిదండ్రులు, దగ్గిర బంధువులు మాత్రమే ఈ వివాహానికి హాజరుకాగా నిఖిల్ పల్లవి చేయి అందుకున్నాడు. నిజానికి గత నెలలోనే నిఖిల్ వివాహం జరగాల్సివుంది. ఐతే లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పట్లో లాక్ డౌన్ నుండి ఉపశమనం దొరికే సూచనలు లేని కారణంగా వీరు సింపుల్ గా వివాహం ముగించాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పల్లవి నిఖిల్ కి పరిచయం కాగా, రెండేళ్లకు పైగా వీరి మధ్య ప్రేమ ప్రయాణం సాగినట్లు సమాచారం. పల్లవి భీమవరం ప్రాంతానికి చెందిన అమ్మాయి. నిఖిల్ పల్లవిల వివాహానికి హాజరుకాకపోయినా సోషల్ మీడియా వేదికగా వీరికి చిత్ర ప్రముఖులు శుభాకాంక్షలు చెవుతున్నారు.

తాజా వార్తలు