ప్రభాస్ చేస్తున్నది చిరు ఎపిక్ మూవీకి సీక్వెలా?

ప్రభాస్ చేస్తున్నది చిరు ఎపిక్ మూవీకి సీక్వెలా?

Published on May 14, 2020 9:08 AM IST

ప్రభాస్-నాగ్ అశ్విన్ లు కొద్దిరోజుల క్రితం ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించగా, ఈ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ రూమర్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సాధారణ మానవుడికి, ఓ దేవకన్యకు పుట్టిన సూపర్ మాన్ గా కనిపించనున్నాడన్న వార్త బయటికి వచ్చింది. ఆ స్టోరీ లైన్ విన్న వెంటనే ఇది జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి సీక్వెల్ కథలా ఉందే, అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అశ్వినీ దత్ సైతం జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ ఉంటుందన్నారు.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ భారీ చిత్రం ఆ సినిమాకు సీక్వెల్ అయి ఉంటుందన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇవి కేవలం ఊహాగానాలే, అసలు నిజం తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ మూవీ అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 సమ్మర్ కి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు