ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో అద్భుతం అంటున్నారు.

ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో అద్భుతం అంటున్నారు.

Published on May 14, 2020 6:56 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ నుండి మరో కొద్దిరోజులలో బిగ్ సర్ప్రైజ్ రానుంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న కొమరం భీమ్ గా ఆయన్ని పరిచయం చేయనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేమికులు ఈ వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే లాక్డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో ఉండకపోవచ్చని కొద్దిరోజులుగా పుకారు నడుస్తుంది. ఐతే అది నిజం కాదని, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఇప్పటికే సిద్ధం అయ్యిందని టాక్.

నిమిషానికి పైగా ఉండే ఈ ఫస్ట్ లుక్ వీడియోలో ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ తో పాటు యాక్షన్ మూమెంట్స్ వీరలెవల్లో కుదిరాయట. ఇప్పటికే ఈ వీడియో చూసిన టీమ్ అద్భుతం అని ఫీడ్ బ్యాక్ ఇచ్చారని వినికిడి. చాలా కాలంగా ఎన్టీఆర్ ని వెండి తెరపై మిస్సవుతున్న ఫ్యాన్స్ దాహం తీర్చేలా ఈ వీడియో ఉంటుందట. ఇప్పటికే విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ఆకట్టుకోగా, అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ వీడియో కూడా ఉంటుందని టాక్. ఇక లాక్డౌన్ ముగిసిన అనంతరం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఆర్ ఆర్ ఆర్ జనవరి 8, 2021లో విడుదల కానుంది.

తాజా వార్తలు