లాక్డౌన్ లో మెగా హీరో హెవీ ట్రైనింగ్..వైరల్ వీడియో

లాక్డౌన్ లో మెగా హీరో హెవీ ట్రైనింగ్..వైరల్ వీడియో

Published on May 14, 2020 12:36 AM IST

కెరీర్ బిగినింగ్ నుండి భిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు హీరో వరుణ్ తేజ్. గత ఏడాది గద్దలకొండ గణేష్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న మాస్ రోల్ చేసి మెప్పించారు. కాగా ఆయన లేటెస్ట్ మూవీలో ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం వరుణ్ ప్రొఫెషనల్ ఇండియన్ బాక్సర్స్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకాగా వైజాగ్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.

లాక్ డౌన్ కారణంగా షూట్ కి బ్రేక్ పడడంతో వరుణ్ ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో బాక్సింగ్ పై టచ్ పోకుండా, బాడీ ఫిట్ గా ఉండడానికి ఇంటి దగ్గరే కఠిన కసరత్తులు చేస్తున్నారు. పంచింగ్ బ్యాగ్ పై పిడిగుద్దులు కురిపిస్తున్న వరుణ్ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు వెంకట్, సిద్దూ ముద్ద నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి ఓ కీలక రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CAHohVrjhA0/

తాజా వార్తలు