బన్నీ “పుష్ప” కోసం ఎన్టీఆర్ లాంటి స్టెప్ తీసుకుంటారా?

బన్నీ “పుష్ప” కోసం ఎన్టీఆర్ లాంటి స్టెప్ తీసుకుంటారా?

Published on May 13, 2020 10:40 PM IST

ప్రస్తుతం అత్యధికంగా పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలు మన టాలీవుడ్ నుంచే ఉన్నాయి. వాటిలో దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ పవర్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు తారా స్థాయిలో ఉండగా ఈ సినిమాలో కొమరం భీం రోల్ లో కనిపించనున్న తారక్ ఒక్క మలయాళం మినహా మిగతా అన్ని భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పడం ఖరారు అయ్యిందని ఇప్పటికే చాలా మందికి తెలుసు. దీనితో ఈ అంశం అభిమానుల్లో మంచి హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడు అదే బాటలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “పుష్ప” పై కూడా నార్త్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.ఎలాగో ఇతర భాషలలో కూడా బన్నీకు మంచి క్రేజ్ ఉంది. దాని నిమిత్తం తాను కూడా ఇతర భాషల్లో తన ఓన్ వాయిస్ తో డబ్బింగ్ చెప్తే మరింత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి బన్నీ కూడా తారక్ లాంటి స్టెప్ తీసుకుంటారో లేదో చూడాలి.

తాజా వార్తలు