ఎనర్జిటిక్ స్టార్ రామ్ తమిళ్ పరిశ్రమపై కన్నేశారు. ఆయన తమిళంలో ఓ స్ట్రైట్ అండ్ సాలిడ్ మూవీ చేయాలనుకుంటున్నారట. అన్నీ కుదిరితే ఓ తమిళ్ మూవీ చేయడానికి సిద్ధం అని ఆయన తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. చెన్నైలో పుట్టి పెరిగిన వాడిగా నాకు తమిళ భాషపై పట్టు వుంది. ఇక తమిళ సినిమా పై గౌరవం, ఆ పరిశ్రమలో మూవీ చేయాలని కోరిక ఉన్నాయని రామ్ చెప్పడం విశేషం.
ఇక ప్రస్తుతం రామ్ చేస్తున్న రెడ్ మూవీ తమిళ హిట్ మూవీ తాడం కి తెలుగు రీమేక్. ఈ చిత్రంతో రామ్ మొదటి సారి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మనిశర్మ సంగీతం అందిస్తున్నారు.