ప్రభాస్ మేనియాతో ఊగిపోతున్న బాలీవుడ్..!

ప్రభాస్ మేనియాతో ఊగిపోతున్న బాలీవుడ్..!

Published on May 10, 2020 10:05 PM IST


మిర్చి సినిమా వరకు ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ముఖ్యంగా ఆయన హిందీ ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ స్టార్ అయ్యారు. అందుకు తాజా ఉందంతమే సాక్ష్యం. గత వారం బి ఏ ఆర్ సి విడుదల చేసిన టెలివిజన్ వ్యూవర్షిప్ రేటింగ్స్ లో ప్రభాస్ సినిమాలు టాప్ రేటింగ్ లో నిలిచాయి. గతవారం హిందీలో బుల్లితెరపై ప్రసారం అయిన చిత్రాలలో ప్రభాస్ సాహో, బాహుబలి మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి.

ఇక రజిని దర్బార్ మూడో స్థానంలో నిలువగా అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4, నాలుగో స్థానం, అమితాబ్ సూర్యవంశం ఐదో స్థానంలో నిలిచాయి. అలాగే సాహో మూవీ ఫలితం బాలీవుడ్ లో పాజిటివ్ గా వచ్చింది. సాహో 150 కోట్లకు పైగా వసూళ్లతో హిట్ మూవీ అనిపించుకుంది. తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజ్ లలో సాహో అంతగా విజయం సాధించకపోవడం గమనార్హం. హిందీ ప్రేక్షకులలో ప్రభాస్ మేనియా బాగా పెరిగిపోయిందని తాజా ఉదంతాలతో అర్థం అవుతుంది. ఒక్క సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

తాజా వార్తలు