క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – స్టార్ హీరో అల్లు అర్జున్ కలయికలో పుష్ప చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. 6 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం 6 కోట్లు ఖర్చు చేయడానికి పుష్ప టీం ప్లాన్ చేస్తోంది. పుష్ప 100% పాన్ ఇండియా సినిమా అని.. ఇండియా సినీ కార్మికులకు ఉపాధి కల్పించే విషయంలో కూడా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్’ అని ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. సినిమాలో స్టార్ కాస్ట్ ను కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తో పాటు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందట. ఆ క్యారెక్టర్ లోనే తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.
ఇక విలన్ గా సునీల్ శెట్టిని అనుకుంటున్నారు. ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
#AlluArjun is going all out to make his next film – #Pushpa – memorable… The actor has plans to spend whopping ₹ 6 cr for a 6-minute action sequence… That's not all, #Pushpa will be 100% 'Made in #India' project, with an effort to provide employment to #Indian film workers. pic.twitter.com/xPS8wo9iXh
— taran adarsh (@taran_adarsh) May 10, 2020