తన వీడియోగ్రఫీతో ఆకట్టుకున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !

తన వీడియోగ్రఫీతో ఆకట్టుకున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ !

Published on May 10, 2020 12:03 PM IST

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌ కు ఫోటోగ్రఫీ పట్ల ఉన్న మక్కువ ఆయన అభిమానులకు బాగా తెలుసు. కాగా ఈ ఉదయం, దేవి శ్రీ ప్రసాద్‌ తనలోని వీడియోగ్రఫీ మరియు ఎడిటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించే వీడియోను ట్విట్టర్ లో విడుదల చేశారు. ది మూన్ పేరుతో వన్ మినిట్ నిడివి గల ఈ వీడియోను దేవి తన ఇంటి పై నుండి టైమ్ లాప్స్ లో బుద్ధ పూర్ణిమ పై తీసాడు. వీడియో బాగా ఆకట్టుకుంటుంది.

దీనికి సంబంధించి దేవి పోస్ట్ చేస్తూ “నిన్న రాత్రి, చంద్రుడు నా ఇంటి పై మెరిసిపోయాడు, జీవితంలో ప్రయాణిస్తున్న మేఘాల గురించి నాతో మాట్లాడుతున్నాడు. అంటూ పోస్ట్ చేశాడ కాగా నేడు మాతృదినోత్సవ సందర్భంగా తన తల్లి శిరోమణి, సోదరి పద్మినికి వినూత్నంగా మదర్స్ డే శుభకాంక్షలు తెలిపారు.తన తల్లితో కలసి దిగిన ఫొటోను, అలాగే సోదరి తన కొడుకుతో ఉన్న ఫొటోను పక్కపక్కనే ఉంచుతూ ట్విట్టర్లో షేర్ చేశాడు.

తాజా వార్తలు