కరోనా మహమ్మారితో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీసీసీకి ఇప్పటికే స్టార్స్ తో సహా పలువురు ప్రముఖులు కూడా విరాళాలు ఇచ్చారు. కాగా తాజాగా ఎస్ఎస్ రాజమౌళి మరియు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కు 10 లక్షల రూపాయిలు విరాళంగా ఇచ్చారు.
కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలోని 24 శాఖల కార్మికుల్లోని పేదలకు సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు.
సినీపరిశ్రమలో ప్రతి కార్మికుడికి ఇంటికి నెలకు సరిపడా బియ్యం-పప్పు ఉప్పు గ్రాసరీల్ని అందిస్తున్నారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ – దర్శకసంఘం అధ్యక్షుడు శంకర్ బృందం కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కోసం నడుం కట్టారు. ఏమైనా కష్ట సమయంలో ఇలా కార్మికులను ఆదుకుంటున్నందుకు సినీ పెద్దలను అభినందించాలి.