వెస్ట్ గోదావరిలో ఆర్ ఆర్ ఆర్ నయా రికార్డ్

వెస్ట్ గోదావరిలో ఆర్ ఆర్ ఆర్ నయా రికార్డ్

Published on Feb 9, 2020 5:58 PM IST

రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, ఎన్టీఆర్ రామ్ చరణ్ ల స్టార్ డమ్ ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు తారాస్థాయికి చేర్చింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ మూవీ థియరిటికల్ హక్కుల కోసం తీవ్ర పోటీ కొనసాగుతుంది. దీనితో ఈ చిత్ర ప్రదర్శన హక్కుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా ఆర్ ఆర్ ఆర్ వెస్ట్ గోదావరి థియరిటికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. 14కోట్ల భారీ ధరకు ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శన హక్కులు అమ్ముడుపోయాయి. గతంలో ఏ చిత్రానికి కూడా వెస్ట్ గోదావరిలో ఇంత భారీ ధర పలుకలేదు. ఇక నైజాంలో కూడా ఆర్ ఆర్ ఆర్ థియరిటికల్ రైట్స్ 75కోట్లు పలికాయి. అలాగే నెల్లూరు 10 కోట్లు, కర్ణాటక 50కోట్లకు ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శన హక్కులను అమ్మడం జరిగింది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్ర తాజా షెడ్యూల్ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ప్రారంభించారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ 2020జులై 30 నుండి 2021 జనవరి 8కి వాయిదావేశారు.

తాజా వార్తలు