విజయ్ సేతుపతి సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్

విజయ్ సేతుపతి సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్

Published on Feb 9, 2020 12:15 PM IST

వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తదుపరి సినిమాలో ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారట. సౌత్ ఇండియాలో సూపర్ పాపులారి సంపాదించుకున్న సమంత, నయనతార ఆయన తదుపరి చిత్రంలో నటిస్తున్నారని సమాచారం. కాతు వాకుల రెండు కాదల్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది. గత ఏడాది చిరంజీవి సరసన సైరా వంటి భారీ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నయనతార, విజయ్ సరసన బిగిల్ మూవీలో నటించారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి మూవీగా వచ్చిన రజిని దర్బార్ లో కూడా నయనతార హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక సమంత టాలీవుడ్ క్వీన్ గా కొనసాగుతుంది. తాజాగా ఆమె నటించిన జాను పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు, ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుతున్నాయి.

తాజా వార్తలు