అల వైకుంఠపురంలో ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసిందే. నాన్ బాహుబలి రికార్డులు ఈ చిత్రం సొంతం చేసుకుంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం వసూళ్ల వరదపారించింది. బన్నీ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, నివేదా పేతురాజ్, సుశాంత్, జయ రామ్, మురళి శర్మ ఇతర కీలకపాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
కాగా అల వైకుంఠపురంలో మేనియా బాలీవుడ్ కి పాకింది. ఈ చిత్ర విజయంలో థమన్ అందించిన సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఈ మూవీ సాంగ్స్ సందడి చేశాయి. అలాగే ఈ పాటలకు బన్నీ స్టెప్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా రాములో.. రాములా సాంగ్ లో ఆయన వేసిన దోశ స్టెప్ భలే పాప్యులర్ అయ్యింది. కాగా ఈ పాటకు ఆ దోశ స్టెప్ వేసి అలరించారు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ శిల్పా శెట్టి. ఇప్పుడు ఆమె వేసిన బన్నీ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో బన్నీ మేనియా బాలీవుడ్ కి పాకిందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
@TheShilpaShetty tiktok Buttabomma song#AlaVaikunthapurramuloo @alluarjun @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine @GeethaArts @SKNonline pic.twitter.com/l8MGeBomqz
— YJR (@yjrambabu) February 8, 2020