జాను ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

జాను ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

Published on Feb 8, 2020 12:50 PM IST

తమిళ సూపర్ హిట్ మూవీ 96 కి తెలుగు రీమేక్ గా వచ్చిన చిత్రం జాను. శర్వానంద్ సమంత జంటగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా జాను చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు డీసెంట్ వసూళ్లు దక్కించుకుంది. ఆంధ్రా, తెలంగాణాలలో కలిపి ఈ చిత్రం మొదటిరోజు 2.4 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువ వసూళ్లే అని చెప్పుకోవాలి. యూఎస్ లో కూడా జాను ఓపెనింగ్స్ భారీగా లేవు.

మరి వీకెండ్ శని, ఆది వారాలలో ఈ చిత్ర వసూళ్లు కొంత మెరుగయ్యే అవకాశం కలదు. ఒరిజినల్ 96కి దర్శకత్వం వహించిన సి ప్రేమ్ కుమార్ జాను చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా గోవింద్ వసంత్ సంగీతం అందించారు.

తాజా వార్తలు