యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు విజయ్ కుమార్ కొండా తెరకెక్కిస్తున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా. నేడు ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈనెల 10 సోమవారం 10:10 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
ఇక గత ఏడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఇద్దరి లోకం ఒకటే మూవీ అనుకోని విధంగా పరాజయం పాలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కనీస వసూళ్లను దక్కించుకోలేక పోయింది. దీనితో రాజ్ తరుణ్ ఈ చిత్రంపై చాల ఆశలే పెట్టుకున్నారు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా గతంలో నితిన్ హీరోగా గుండెజారీ గల్లంతయ్యిందే మూవీకి దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కే కే రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఒరేయ్ బుజ్జిగా సినిమాకు సంగీతం అందిస్తున్నారు.