డైరెక్టర్ గోపీచంద్ మలినేని – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో రాబోతున్న ‘క్రాక్’ సినిమా ప్రస్తుతం చీరాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చీరాలలోని రామాపురం బీచ్ లో సాంగ్ కు సంబంధించిన షాట్స్ తో పాటు కొన్ని సీన్స్ కూడా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన బలుపు మంచి విజయం సాధించింది.
ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ లో పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు.