ఈ నెల 21న వస్తున్న ” శివలింగాపురం” అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకట స్వామి నిర్మించిన చిత్రం ” శివలింగాపురం”. ఆర్కే సురేష్,మధుబాల జంటగా డీస్. రావు,బేబీ హర్షిత మొ ముక్ష్య తారాగణంతో కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రం. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగల శివలింగం దొంగిలించబడుతుంది.
అత్యంత ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి శివలింగాన్ని ఆ విద్రోహుల చెర నుండి ఎలా రక్షించాడు అనే అంశం పై దర్శకుడు తోట కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారని , సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిల్ , కన్నడ , మలయాళ భాషల్లో మహా శివరాత్రి పర్వదినాన ఈ నెల 21న విడుదల చేస్తున్నామని నిర్మాత రావూరి వెంకట స్వామి ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ సినిమాకి సంగీతం : ఘన శ్యామ్, ఎడిటింగ్: మేనగ శ్రీను, మాటలు: చరణ్. కధ: విడదల, పాటలు: టంగుటూరి రాందాస్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తోట కృష్ణ.