నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా అప్పుడే విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసుకుందట. ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నాని ఈ సినిమాలో కొత్త లుక్ ట్రే చేస్తున్నాడట.
కాగా నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. మరి నిన్ను కోరి మేజిక్ రిపీట్ అవుతుందా చూడాలి. అన్నట్టు షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.