మహేష్ డైరెక్ట్ ని బన్నీ పార్టీకి పిలవలేదా..?

మహేష్ డైరెక్ట్ ని బన్నీ పార్టీకి పిలవలేదా..?

Published on Feb 4, 2020 7:13 AM IST

అల వైకుంఠపురంలో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు బన్నీ. ఈ చిత్రంతో చాలా రికార్డులు బన్నీ తన పేరు మీదికి మార్చుకున్నారు. వరల్డ్ వైడ్ గా 150కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన అల వైకుంఠపురంలో మూవీ యూఎస్ లో నాన్ బాహుబలి రికార్డు నమోదుచేసింది. దీనితో వరుస విజయోత్సవాలలో బన్నీ పాల్గొంటున్నారు. కాగా రెండు రోజుల క్రితం బన్నీ టాలీవుడ్ డైరెక్టర్స్ అందరికీ తన ఇంటిలో పార్టీ ఇచ్చారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు తో పాటు కొరటాల, సురేందర్ రెడ్డి, విక్రమ్ కుమార్, శ్రీను వైట్ల, మారుతి, కరుణాకర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో పాటు చాలా మంది అప్ కమింగ్ డైరెక్టర్స్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు.

ఈ పార్టీలో బన్నీ 20వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ మరియు సరిలేరు నీకెవ్వరు డైరెక్టర్ అనిల్ రావిపూడి కనిపించలేదు. సుకుమార్ ప్రస్తుతం బన్నీ మూవీ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేకపోయి ఉంటారు. మరి అనిల్ రావిపూడి పార్టీలో కనిపించకపోవడం ఆసక్తి రేపుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మరో సంక్రాంతి సినిమాగా విడుదలైన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు మధ్య కలెక్షన్స్, రికార్డుల విషయంలో కొంత రైవల్రీ నడిచింది. ఈ రెండు చిత్రాల మధ్య పెద్ద యుద్ధమే నడిచిన నేపథ్యంలో కొంచెం దూరం కూడా పెరిగింది. అందుకే అనిల్ రావిపూడిని పిలువలేదా, పిలిచినా వెళ్లలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

తాజా వార్తలు