మార్చ్ నెల నుండి సుధీర్ వర్మ కొత్త చిత్రం

మార్చ్ నెల నుండి సుధీర్ వర్మ కొత్త చిత్రం

Published on Feb 2, 2020 6:48 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని తెలుగులోకి ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి గ్రాండ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ మరొక కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను కూడా రీమేక్ చేసే చేయడానికి సిద్దమయ్యారు. ఈ సినిమాను ‘రణరంగం’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నారు.

ఇదొక యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్. ఇందులో నివేత థామస్, రెజినా కసాండ్ర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.
అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా వీరికి శిక్షణ ఇస్తున్నారట. మార్చి నెల మూడవ వారం నుండి ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశాలున్నాయి.

తాజా వార్తలు