బ్రహ్మాస్త్ర మూవీ విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

బ్రహ్మాస్త్ర మూవీ విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Published on Feb 2, 2020 11:50 AM IST

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, అమితా బచ్చన్, అలియా భట్, మౌని రాయ్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్ర విడుదల తేదీపై నటుడు అమితాబ్ ఓ క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మాస్త్ర ఈ ఏడాది డిసెంబర్ 4న విడుదల కానున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఈ తేదీలో ఎటువంటి మార్పు ఉండదు అన్నట్లు కూడా ఆయన హింట్ ఇచ్చారు. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైంది. గత ఏడాది డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. భారీ చిత్రం కావడంతో అనేక కారణాలతో ఈ చిత్రం అనుకున్న విధంగా షూటింగ్ జరుపుకోలేదు.

బ్రహ్మాస్త్ర మూవీ పలు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక కింగ్ నాగార్జున ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన ఆర్కియాలజిస్ట్ గా కనిపిస్తారని సమాచారం. బ్రహ్మాస్త్ర సినిమాకు సంగీతం ప్రీతమ్ అందిస్తున్నారు.

తాజా వార్తలు